
ఆదిలాబాద్ జిల్లా అల్లకల్లోలం అయిపోయింది. ఎప్పుడూ లేని వాన.. ఎన్నడూ చూడని వరద.. జిల్లాను ముంచేసింది. రోడ్లపై నదులు ప్రవహిస్తున్నాయి. ఊర్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. ఇళ్లలోకి వరద నీరు చేరుకుని ఇంట్లో ఫర్నీచర్, కూరగాయలు, బియ్యం, బట్టలూ.. ఇలా అన్నీ నీళ్ల పాలయ్యాయి. ఇంటా బయట మోకాలి ఎత్తు నీళ్లు చేరుకోవడంతో ఏం చేయాలో.. ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితి వాళ్లది.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అదిలాబాద్ జిల్లా అతలాకుతలం అయ్యింది. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షానికి సోమవారం (ఆగస్టు 18) జిల్లా కేంద్రం సముద్రాన్ని తలపిస్తోంది. పట్టణంలో కాలనీలన్నీ జలమయం అయ్యాయి.
పట్టణంలోని దోబి కాలనిలో ఇండ్లలోకి భారీగా చేరిన వరదనీరు చేరుకుంది. వరదనీటిలో పర్నిచర్, తిండిగింజలు అన్నీ మునిగిపోయాయి. దీంతో నిత్యావసర వస్తువులకు ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఆహార పదార్థాలు వరద నీటిలో కూరుకుపోవడంతో ఆకలికి అలమటిస్తున్నారు. అదుకోవాలని అధికారులను కోరుతున్నారు.
ALSO READ : హైదరాబాద్ కూకట్ పల్లి వాసులకు అలర్ట్..
మరోవైపు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు వాగులు, వంకలూ పొంగి పొర్లుతున్నాయి. ఉట్నూర్ మండల కేంద్రంలో ఎడతెరిప లేకుండా కురుస్తున్న వర్షాని శంభు మత్తడిగూడ ప్రాజెక్టు పొంగి ప్రవహిస్తోంది. రాకపోకలన్నీ నిలిచిపోయాయి.