బాల్కొండలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద

బాల్కొండలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద

బాల్కొండ, వెలుగు: ఎగువన గోదావరి మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు ఎగువ నుంచి గరిష్ఠంగా 65,740 క్యూసెక్కుల వరద వస్తుండడంతో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. 

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091. అడుగులు,80.50 టీఎంసీలు కాగా, సోమవారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటి మట్టం 1073.40 అడుగులు, 29.49 టీఎంసీలకు చేరింది. కాకతీయ కెనాల్ కు 100క్యూసెక్కులు, తాగునీటి కోసం 231క్యూసెక్కుల నీటిని విడుదలచేస్తున్నారు.