తాలిపేరుకు పోటెత్తుతున్న వరద

 తాలిపేరుకు పోటెత్తుతున్న వరద
  • 22 గేట్లు ఎత్తి 54,284 క్యూసెక్యుల నీటి విడుదల 

భద్రాచలం, వెలుగు :  భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తుతోంది. తాలిపేరు పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో రిజర్వాయర్​లోకి నీరు వచ్చి చేరుతోంది. శనివారం ప్రాజెక్టు 22 గేట్లను ఎత్తి 54,284 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.

మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తాలిపేరు ప్రాజెక్టు వద్ద ఇంజినీర్లు అలర్ట్​ప్రకటించారు. ప్రాజెక్టుకు దిగువన నదిలో చేపల వేటను నిషేధించారు. నాటు పడవలల్లో ప్రయాణాలను నిలిపేశారు.