నిర్మల్ జిల్లా: వరదలో చిక్కుకున్న పశువుల కాపర్లు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

నిర్మల్ జిల్లా: వరదలో చిక్కుకున్న పశువుల కాపర్లు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

నిర్మల్​  జిల్లాలో  వద్ద భయంకర పరిస్థితి కనిపిస్తోంది. ఎడతెరిపి లేకుండా  కుండపోత వర్షాల కారణంగాజనాలు ఇబ్బంది పడతున్నారు . ఓ పక్క భారీ వర్షాలు.. మరో పక్క  ఎగువ ప్రాజెక్ట్​ల నీరు విడుదల కావడంతో.. .   లక్ష్మణ్ చందా మండలం మునిపెల్లి  గోదావరి పరిసర ప్రాంతాల్లో పశువులు కాయడానికి వెళ్ళిన ముగ్గురు పశువుల కాపర్లు వరద నీటిలో చిక్కుకున్నారు.   అందులో ఇద్దరిని  ఎన్​ డీఆర్​ ఎఫ్​ రెస్క్యూ టీం కాపాడింది.   ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో ఇంకో వ్యక్తి అవతలి ఒడ్డునే  ఉండిపోయాడు.   సమాచారం అందిన వెంటనే హుటాహుటిన  ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల.. అతని కోసం మునిపెల్లి లో ఉన్న గోదావరి నది లో చిక్కుకున్న  వ్యక్తి  నిన్నటి ( ఆగస్టు 27)  నుంచి రెస్క్యూటీం గాలిస్తున్నట్లు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు.