
హైదరాబాద్: తెలంగాణలో కుండపోత వాన కురుస్తోంది. గురువారం (సెప్టెంబర్ 25) రాత్రి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో పాటు, ఎగువ నుంచి వస్తోన్న వరదతో రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులకు వరద పొటెత్తింది. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండకుండలా మారాయి. ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగడంతో అప్రమత్తమన అధికారులు ప్రాజెక్టుల గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 22 గేట్లు ఓపెన్:
- నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కు వరద ప్రవాహం
- 22 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల
- ఇన్ ఫ్లో :- 224745. క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో : 216467.క్యూసెక్కులు
- ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం:- 590 అడుగులు
- ప్రస్తుత నీటి మట్టం:- 587.10..అడుగులు.
- పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం:- 312.0450 టీఎంసీలు
- ప్రస్తుత నీటి నిల్వ:- 305.6456.టీఎంసీలు
- జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్కు భారీ వరద.. 30 గేట్ల ఎత్తివేత:
- ఎగువన కురుస్తున్న వర్షలతో పాటు ఎస్ఆర్ఎస్పీ, కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా ఇన్ ఫ్లో
- ప్రాజెక్టు 30 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల
- ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు
- ప్రస్తుత నీటి సామర్ధ్యం15.579 టీఎంసీలు
- ప్రాజెక్టు ఇన్ ఫ్లో 335265
- ఔట్ ఫ్లో 286039 క్యూసెక్కులు
మూసీ ప్రాజెక్ట్ 3 గేట్లు ఓపెన్:
- ఇన్ ఫ్లో:- 6791.33 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో :- 4359.52 క్యూసెక్కులు
- ప్రాజెక్ట్ పూర్తి స్దాయి నీటిమట్టం:- 645..అడుగులు
- ప్రస్తుతం నీటిమట్టం:- 643.90అడుగులు.
- ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం:- 4.46 TMC లు
- ప్రస్తుతం నిల్వ :- 4.17 TMC లు
- 3 క్రస్ట్ గేట్లు 2 ఫీట్ల మేర పైకి ఎత్తి దిగువకు నీటి విడుదల
కడెం ప్రాజెక్ట్కు కొనసాగుతోన్న వరద:
- ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్ట్కు వరద పొటెత్తింది.
- ఇన్ ఫ్లో: 8849 క్యూసెక్కులు
- అవుట్ ఫ్లో: 6946 క్యూసెక్కులు
- ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 700 అడుగులు
- ప్రస్తుతం నీటిమట్టం 698.275అడుగులు
- ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 4.6 టీఎంసీలు
- ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 4.2టీఎంసీలు
- ఒక గేట్ ఎత్తి వరద నీరు దిగువకు విడుదల