నేపాల్లో వరదలు..18 మంది గల్లంతు

నేపాల్లో వరదలు..18 మంది గల్లంతు

ఖాట్మండు: నేపాల్‌‌- చైనా బార్డర్​లో వరదలు ముంచెత్తడంతో ఈ రెండు దేశాలను కలిపే ఫ్రెండ్ షిప్ బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో18 మంది గల్లంతయ్యారు. మంగళవారం చైనాలో కురిసిన ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నేపాల్‌‌ లోని భోటేకోషి నది పొంగి వరదలు సంభవించాయి. 

దీంతో రసువా జిల్లాలోని మిటేరి వంతెన కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఇద్దరు పోలీసులతో సహా 11 మందిని రక్షించారు. వరదలతో18 మంది గల్లంతయ్యారని తెలిపారు. వీరిలో ఆరుగురు చైనీయులు కూడా ఉన్నారని చెప్పారు.