
ఉత్తరాఖండ్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పితోరాఘడ్ జిల్లా మడ్కట్ గ్రామంలో వరదనీటిలో చిక్కుకొని ముగ్గురు ప్రాణాలు కొల్పోయారు. మరో 11 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద బాధితులకోసం అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.