మంచిర్యాల జిల్లాలో 10 వేల ఎకరాల్లో పంట నష్టం

మంచిర్యాల జిల్లాలో 10 వేల ఎకరాల్లో పంట నష్టం

భారీ వర్షాల కారణంగా పోటెత్తిన గోదావరి మంచిర్యాల జిల్లా రైతులను నిండా ముంచేసింది. వారం రోజులుగా నీరు నిల్వ ఉండడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరద తాకిడికి పొలాలు కొట్టుకుపోగా, పత్తి మొక్కలు ధ్వంసమయ్యాయి. 

వరదల కారణంగా జిల్లా వ్యాప్తంగా 10 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అగ్రికల్చర్‌‌ ఆఫీసర్ల సర్వేలో తేలింది. ఇప్పటికే ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల దాక పెట్టుబడి పెట్టామని, వరదల కారణంగా మొత్తం నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. - మంచిర్యాల, వెలుగు