అయెధ్య రామ మందిరం పై పూల వర్షం

అయెధ్య రామ మందిరం పై పూల వర్షం

అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే అయోధ్య వీధుల్లో, రోడ్ల మీద రామభక్తులు పెద్ద ఎత్తున చేరి ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.  ఈ క్రమంలోనే రాముడు కొలువుండే గుడి పై పూల వర్షం కురిపించారు. ఆర్మీ హెలికాప్టర్ తో రామమందిరం పై కొన్ని టన్నుల పూలను వేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలో 30 మంది కళాకారులతో భారతీయ సంగీత వాయిద్యాలను మోగించారు.

అభిజీత్ ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. 121 మంది ఆచార్యులచే క్రతువులు నిర్వహించనున్నారు. గణేశ్వర శాస్త్రి ద్రవిడ ఆచార వ్యవహారాలను పర్యవేక్షించి సమన్వయం చేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.