ఊర్లల్లో ప్యాకెట్ ఫుడ్ సేల్స్ డల్

ఊర్లల్లో ప్యాకెట్ ఫుడ్ సేల్స్ డల్

న్యూఢిల్లీ:  రూరల్ ఏరియాల్లో డిమాండ్ పడిపోయిందని సబ్బులు, షాంపూలు వంటి ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అమ్మే ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీజీ కంపెనీలు చెబుతున్నాయి. పట్టణాల్లో డిమాండ్ బాగుండడం వలన గ్రామాల్లో కూడా నెమ్మదిగా  డిమాండ్ పుంజుకుంటుందని ఆశిస్తున్నాయి. ‘ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీజీ  సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించినంత వరకు గ్రామాల్లో  స్లోడౌన్ కనిపిస్తోంది. రూరల్ ఏరియాల్లో విస్తరిస్తున్నా, మరిన్ని గ్రామాలకు చేరుకుంటున్నా సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సేల్స్ పెరగలేదు.

రూరల్ ఎకానమీ పుంజుకునేలా మా లాంటి కంపెనీలు చేయలేవు’ అని  బ్రిటానియా వైస్ చైర్మన్ వరుణ్ బెర్రి పేర్కొన్నారు.  ఈ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంపెనీ వాల్యూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండడాన్ని గమనించాలి. రూరల్ మార్కెట్లలో బ్రిటానియా వాల్యూమ్స్ గ్రోత్ ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4 శాతం, మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేవలం 0.3 శాతమే పెరిగాయి.

సెప్టెంబర్ క్వార్ట ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సేల్స్ అంతకు ముందు క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నట్టే నమోదయ్యాయని పారాషూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయిల్ తయారీ కంపెనీ మారికో పేర్కొంది. పట్టణాల్లో  మాత్రం  సేల్స్ పెరుగుతున్నాయని వెల్లడించింది. ఫుడ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ ఎక్కువగా ఉండడం, వర్షాలు సరిగ్గా పడకపోవడం వంటి కారణాలతో రూరల్ డిమాండ్ స్లోడౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి జారుకుందని వెల్లడించింది.