పశుగ్రాసం కొరత ... ఇబ్బందుల్లో పాడి రైతులు

పశుగ్రాసం కొరత ... ఇబ్బందుల్లో పాడి రైతులు

మహారాష్ట్రలో పశుగ్రాసం (గడ్డి) సంక్షోభం ఏర్పడింది.  వర్షపాతం తక్కువ నమోదు.. కరువు కారణంగా పశువుల మేత సమస్య ఏర్పడింది.  అకోలా జిల్లా అధికారులు పశుగ్రాసం కొరతతో  కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పశుగ్రాసం.... కోళ్ల దాణా... టోటల్​ మిక్స్​ రేషన్​ ( టీఎంఆర్​)ను ఇతర జిల్లాలకు రవాణా చేసే అంశంలో బ్యాన్​ విధించారు.  దీంతో కొంతవరకు సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. అకోలా జిల్లా అధికారులు తీసుకున్న నిర్ణయంతో  పశుపోషణ రైతులకు ఊరట లభించింది. ఈ ఏడాది మహారాష్ట్రలో తక్కువ వర్షపాతం నమోదైంది. మొత్తం  1021 రెవెన్యూ డివిజన్లలో కరువు పరిస్థితిని ప్రకటించారు.  అకోలా జిల్లాలోనే కరువు పరిస్థితి దారుణంగా ఉందని అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి నెలలో  పర్భాని జిల్లాలో పశుగ్రాసం కొరతతో అక్కడ కూడా ఇతర జిల్లాలకు ఎగుమతి చేసే అంశంపై నిషేధం విధించారు. 

మహారాష్ట్రలో పశుగ్రాసం  పశుగ్రాసం ధరలు పెరగడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.  సోయాబీన్​, బెండకాయల మేతను అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇలాంటే పరిస్థితి నెలకొంది.  పాల ధర విషయంలో ఎలాంటి మార్పు లేకపోవడంతో పాల రైతులు.. పశువులకు గడ్డి కొనలేని పరిస్థితిలో ఉన్నారు. 

మహారాష్ట్రలో చాలా ప్రాంతాల్లో జనవరి నెలలోనే కరువు పరిస్థితులు నెలకొన్నాయి.  ఫిబ్రవరి మధ్యలో పశుగ్రాసం కొరత పెద్ద సమస్యగా మారింది.  ఉరద్, జొన్న, సోయాబీన్ ,అర్హర్ విత్తనాలు తగ్గడంతో దీని ప్రభావం  పశుగ్రాసంపై ప్రత్యక్షంగా చూపుతోంది.  దూరప్రాంతాల నుంచి మేత తీసుకురావడంతో..  దీంతో ఖర్చులు పెరుగుతాయని పశుపోషకులు చెబుతున్నారు. . పశుగ్రాసం ఉత్పత్తికి వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని  రైతులు  విజ్ఞప్తి చేస్తున్నారు.