అమ్మ బాబోయ్..ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు

అమ్మ బాబోయ్..ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు

 నార్త్ ఇండియా మొత్తాన్ని పొగ మంచు కమ్మేసింది. చలిగాలులతో అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. బయటకు వెళ్దామంటే రోడ్డు సరిగ్గా కనిపించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీని పొగ మంచు కమ్మేసింది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలో భారీగా పడిపోయాయి. శుక్రవారం ఉదయం ఉష్ణోగ్రత 5.4 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గడంతో కొన్ని ప్రాంతాలు దట్టమైన పొగమంచుతో కప్పబడ్డాయి.  

23 రైళ్లు ఆలస్యం

 వాతావరణం అనుకూలించక 23 రైళ్లు ఆరు గంటలు ఆలస్యంగా నడిచాయి. అజ్మీర్-కత్రా పూజా ఎక్స్‌ప్రెస్, కతిహార్-అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్ మరియు ఖాజారావ్-కురుక్షేత్ర ఎక్స్‌ప్రెస్ అనే మూడు రైళ్లు ఆరు గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తున్నాయి. నార్త్ రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కామాఖ్య- -ఢిల్లీ Jn (బ్రహ్మపుత్ర మెయిల్)  మరియు పూజా ఎక్స్‌ప్రెస్‌తో సహా రెండు రైళ్లు దాదాపు 5.30 గంటలు ఆలస్యంగా చేరుకునే ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  

 
న్యూఢిల్లీ వందే భారత్ -ఎక్స్‌ప్రెస్, బెంగళూరు - -న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్, లక్నో - -న్యూఢిల్లీ తేజస్ ఎక్స్‌ప్రెస్, ప్రయాగ్‌రాజ్ - -న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్, భాగల్‌పూర్ సహా తొమ్మిది రైళ్లు దాదాపు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. దేశ రాజదాని  ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్టు ప్రాంతం పొగమంచుతో కమ్మేసుకుంది. ఇది విమాన కార్యకలాపాల పై పెద్దగా ప్రభావం చూపలేదు. విమానాలు యదాతథంగా నడిచాయి.