ఈ చిట్కాలు పాటిస్తే ఆయిలీ స్కిన్‌‌‌‌కి చెక్‌‌‌‌ పెట్టొచ్చు!

ఈ చిట్కాలు పాటిస్తే ఆయిలీ స్కిన్‌‌‌‌కి చెక్‌‌‌‌ పెట్టొచ్చు!

ఏం చర్మం జిడ్డుగా ఉండటం.. అంటే ఆయిలీ స్కిన్‌‌‌‌ అన్నది పెద్ద సమస్యే. ముఖం అందంగా కనిపించకపోవడం పక్కనబెడితే.. ఎప్పుడూ ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటప్పుడే.. ‘నా చర్మం ఇంతేలే’ అని వదిలేస్తుంటారు చాలామంది.కొన్ని చిట్కాలు పాటిస్తే ఆయిలీ స్కిన్‌‌‌‌కి చెక్‌‌‌‌ పెట్టొచ్చు!

  • ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా ముఖం కడుక్కోవాలి. ఎక్సర్‌‌‌‌సైజ్‌‌‌‌ చేసిన తర్వాత ముఖం కడగడం తప్పనిసరి. అయితే ముఖం మీద నీళ్లు  చల్లుకునేటప్పుడు చర్మాన్ని గట్టిగా రుద్దుకోవద్దు.
  • ‘ఆయిల్‌‌‌‌ ఫ్రీ’, ‘నాన్‌‌‌‌ కమెడోజెనిక్‌‌‌‌’ లేబుల్‌‌‌‌  ఉన్న స్కిన్‌‌‌‌ ప్రొడక్ట్స్‌‌‌‌ మాత్రమే కొనాలి.
  • చర్మానికి పడే ఫేస్‌‌‌‌వాష్‌‌‌‌ని మాత్రమే వాడాలి.
  • ఆయిల్‌‌‌‌ బేస్డ్‌‌‌‌, ఆల్కహాల్‌‌‌‌ బేస్డ్‌‌‌‌ క్లెన్సర్స్‌‌‌‌ వాడొద్దు.
  • ఆయిలీ స్కిన్‌‌‌‌ ఉన్నా కూడా మాయిశ్చరైజర్‌‌‌‌ తప్పకుండా వాడాలి.
  • బయటికి వెళ్లేటప్పుడల్లా సన్‌‌‌‌స్క్రీన్‌‌‌‌ రాసుకోవడం మర్చిపోవద్దు.
  • మేకప్‌‌‌‌తోనే పడుకోవడం చర్మానికి మంచిది కాదు. నిద్రపోయే ముందు మేకప్‌‌‌‌ కచ్చితంగా తీసేయాల్సిందే.
  • బ్లాటింగ్‌‌‌‌ పేపర్‌‌‌‌ని ముఖానికి ఉంచితే చర్మం మీద ఆయిల్‌‌‌‌ని పీల్చుకుంటుంది. అయితే ఆ పేపర్‌‌‌‌ని ముఖం మీద పెట్టి ఉంచాలంతే, చర్మమంతా రుద్దకూడదు.

డాక్టర్ వ్రితికా గడ్డం,

ఎం.డి. డెర్మటాలజీ,

నావా స్కిన్ అండ్ బాడీ కేర్,

హైటెక్స్, హైదరాబాద్.

ఆన్​ లైన్ కన్సల్టేషన్ కోసం​ 7799726282.

 

ఆన్ లైన్లో దేని కోసం సెర్చ్ చేస్తున్నారో తెలుసా?