ఈ టిప్స్ తో మీ ఫేస్ ఫ్యాట్​ పరార్​

ఈ టిప్స్ తో మీ ఫేస్ ఫ్యాట్​ పరార్​

ఈరోజుల్లో ఎవరి నోట విన్నా.. ‘త్వరలో జిమ్​లో జాయిన్ అవ్వాలి. బరువు తగ్గాల్సిందే’ లాంటి మాటలే. అవునా..! అయితే అది ఒకటి, రెండు రోజుల్లో అయ్యే పని కాదు. శరీర బరువు మొత్తంలో కొద్దిగా తగ్గడమే కష్టం అనుకుంటే.. ఒక ప్రత్యేక భాగంలో కొవ్వు తగ్గాలంటే మరింత కష్టం. అందులోనూ ముఖం మీద ఉన్న కొవ్వు (ఫేస్​ ఫ్యాట్) తగ్గటం ఇంకొంచెం కష్టమే మరి. ​

కొందరు బరువు పెరిగితే.. పొట్ట, చేతి కండరాలు, తొడల భాగాల్లో ఎక్కువగా కొవ్వు పేరుకుపోతుంది. మరికొంతమందికి మాత్రం ముఖం లావుగా అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలో తెలియక, చాలామంది డిప్రెషన్​లోకి వెళ్తుంటారు. అయితే కొన్నిరకాల అలవాట్లకు దూరంగా ఉండి, కొన్ని పనులు చేయడం నేర్చుకుంటే.. సమస్య ఈజీగా పరిష్కారమవుతుంది.

నీళ్లు అవసరం

భూమిలాగే మన శరీరం కూడా 70 శాతం నీళ్లతోనే ఉంటుంది. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి నీళ్లు ఎంతో అవసరం. అలాగే బరువు తగ్గాలనుకుంటే రోజులో వీలైనన్ని ఎక్కువ గ్లాసుల నీళ్లు తాగాలంటారు డాక్టర్లు. ఫేస్​ ఫ్యాట్​ తగ్గడానికి కూడా నీళ్లు బాగా ఉపయోగపడతాయి. అందుకే ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా ఎప్పుడూ పక్కన ఒక వాటర్​ బాటిల్​ పెట్టుకోవాలి. లేదంటే నీళ్లు తాగాలనే ఆలోచన మనసులోకి రాదు. రోజులో కనీసం రెండు లీటర్ల నీళ్లైనా తాగితే కొవ్వు కరుగుతుంది.

 

ఉప్పు ముప్పే

అవసరానికి మించి ఎక్కువ ఉప్పు తీసుకుంటే.. శరీరంలో వాటర్​ రిటెన్షన్​ పెరుగుతుంది. దానివల్ల శరీరంలోని కొన్ని భాగాల్లో వాపులు ఏర్పడతాయి. ముఖం ఉబ్బినట్టు అవుతుంది. ఇందుకోసం ఆహారంలో సోడియం ఎక్కువగా పోకుండా జాగ్రత్త పడాలి. కూరలు, రసాల్లో ఉప్పు శాతాన్ని చాలావరకు తగ్గించాలి. ముఖ్యంగా కూరల్లో ఉప్పు తక్కువగా అనిపించినప్పుడు, పై నుంచి అసలు చల్లుకోవద్దు. సలాడ్స్​లో కూడా ఉప్పు వేసుకోవద్దు.

 

ఆల్కహాల్​ ఆపేయాలి

కొందరికి ఆల్కహాల్​ (మందు) వ్యసనంగా ఉంటుంది. ఇంకొందరు దాన్ని అకేషనల్​గా తీసుకుంటారు. ఎవరు ఎలా తీసుకున్నా, మందు ఆరోగ్యానికే కాదు, అందానికీ మంచిది కాదు. అందులో క్యాలరీలు ఎక్కువగా, పోషకాలు తక్కువగా ఉంటాయి. దానివల్ల ఫేస్​ ఫ్యాట్​ కూడా పెరుగుతుంది. ఆల్కహాల్​కి బదులు తాజా పండ్ల రసాలు తీసుకుంటే ముఖం ఆరోగ్యంగా, అందంగా మారుతుంది.

 

 

ఫేషియల్​ ఎక్సర్​సైజ్​

కొన్నిరకాల ఫేషియల్​ ఎక్సర్​సైజులు చేయడం వల్ల.. ఫేస్​ ఫ్యాట్ కచ్చితంగా తగ్గకపోయినా ముడతలు రాకుండా ఉంటుందంటారు నిపుణులు. ఈ ఎక్సర్​సైజులు ముఖంపై కండరాలను స్ట్రెచ్​ చేయడం వల్ల.. ముఖం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. ఫేషియల్​ ఎక్సర్​సైజులు ఫ్యాట్​ని తగ్గిస్తాయని కొన్ని స్టడీలు చెప్తున్నాయి.​