పళ్ల మధ్య సందులు పెద్దగా ఉంటే ఎంత సేపు బ్రష్ చేసినా ఎక్కడో ఒకచోట ఫుడ్ పార్టికల్స్ మిగిలిపోతాయి. అలాంటప్పుడు ఈ డెంటల్ వాటర్ ఫ్లోజర్ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఒరాక్యూరా అనే కంపెనీ తీసుకొచ్చింది. దీంతో వాటర్ స్ప్రే చేసుకుంటే నోటిలోని ప్రతి మూల క్లీన్ అవుతుంది. ఆరోగ్యకరమైన చిగుళ్లు, మెరుగైన నోటి పరిశుభ్రతకు సాయపడుతుంది. పళ్లపై ఉండే పాచి, టార్టార్‌ని తొలగిస్తుంది. దీంతో టీత్ ఇంప్లాంట్లు, బ్రేసెస్, బ్రాకెట్ల చుట్టూ శుభ్రం చేసుకోవచ్చు.
ఇందులో నాలుగు మోడ్స్ ఉంటాయి. 0.6 ఎంఎం వాటర్ జెట్ స్ప్రే నాజిల్‌తో వస్తుంది. వాటర్ ప్రెజర్‌ని తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి 8 మోడ్స్ ఉంటాయి. నీళ్లు నింపడానికి 200 ఎంఎల్ కెపాసిటీ ఉండే వాటర్ ట్యాంక్ ఉంటుంది. 2 నాజిల్స్ (స్టాండర్డ్ టిప్, టంగ్ స్క్రాపర్), చార్జ్ చేసుకోవడానికి యూఎస్‌బీ కేబుల్ కూడా ప్యాక్‌లోనే వస్తాయి. ఇందులో రీచార్జబుల్ లిథియం–అయాన్ బ్యాటరీ ఉంటుంది. 3–4 గంటల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 10–15 రోజులు వాడుకోవచ్చు.
ధర రూ. 1,999
►ALSO READ | టూల్స్ & గాడ్జెట్స్: జ్యూవెలరీ క్లీనింగ్ కోసం బెస్ట్ మెషిన్ ఇది..
