టూల్స్ & గాడ్జెట్స్: జ్యూవెలరీ క్లీనింగ్ కోసం బెస్ట్ మెషిన్ ఇది..

టూల్స్ & గాడ్జెట్స్: జ్యూవెలరీ క్లీనింగ్ కోసం బెస్ట్ మెషిన్ ఇది..

పళ్ల సెట్‌‌‌‌‌‌‌‌, జ్యువెలరీ.. లాంటివాటిని ఎంత బాగా క్లీన్‌‌‌‌‌‌‌‌ చేసినా ఏదో ఒక మూలన జిడ్డు ఉండిపోతుంది. అలాంటప్పుడు ఈ అల్ట్రాసోనిక్ క్లీనింగ్ మెషిన్​తో క్లీన్‌‌‌‌‌‌‌‌ చేస్తే సరిపోతుంది. దీన్ని ఫ్నిటీ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఈ గాడ్జెట్​ హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్‌‌‌‌‌‌‌‌తో 360 డిగ్రీల్లో ప్రతి సందులో క్లీన్‌‌‌‌‌‌‌‌ చేస్తుంది. దీంతో అలైనర్లు, ఆర్థోడాంటిక్ ఉపకరణాలు, వైట్నింగ్ ట్రేలు, నైట్ మౌత్ గార్డ్‌‌‌‌‌‌‌‌లు, టూత్ బ్రష్ హెడ్స్‌‌‌‌‌‌‌‌ లాంటివన్నింటినీ 5 నుంచి10 నిమిషాల్లో శుభ్రం చేసుకోవచ్చు. 

ఇది యూవీ లైట్ల సాయంతో పనిచేస్తుంది. సింగిల్ టచ్ కంట్రోల్‌‌‌‌‌‌‌‌తో వస్తుంది. ఈజీగా ఆపరేట్​ చేయొచ్చు. దీనికి 375ఎంఎల్‌‌‌‌‌‌‌‌ ట్యాంక్ ఉంటుంది. మెషిన్‌‌‌‌‌‌‌‌ని  పూర్తిగా ఏబీఎస్‌‌‌‌‌‌‌‌ ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌తో తయారుచేశారు. ట్యాంక్‌‌‌‌‌‌‌‌ని మాత్రం ఇన్సులేటెడ్ స్టెయిన్‌‌‌‌‌‌‌‌లెస్ స్టీల్‌‌‌‌‌‌‌‌తో చేశారు. కిందిభాగంలో నాలుగు నాన్-స్లిప్ రబ్బరు గ్రిప్‌‌‌‌‌‌‌‌లు ఉంటాయి. 
ధర : రూ. 4,346