బీఆర్ఎస్కు పొంగులేటి వర్గీయుల రాజీనామా

బీఆర్ఎస్కు పొంగులేటి వర్గీయుల రాజీనామా

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీకి షాకిచ్చారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకట్ రెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. వీరితో పాటు..వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, సొసైటీ డైరెక్టర్లు మొత్తం 12 మంది బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. 

బహిష్కరణ

మరోవైపు బీఆర్ఎస్పై తిరుగుబాటు ఎగురవేసిన వైరా నియోజకవర్గంలోని 20 మంది ముఖ్యనాయకులను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. సీఎం కేసీఆర్పై వ్యక్తిగత దూషణలకు పాల్పడి..పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన 20 మందిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ వైస్‌ ఛైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, వైరా మున్సిపల్ ఛైర్మన్‌ జైపాల్‌తో పాటు మరో 18 మందిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్‌ చేసింది. 

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు.  తనకు కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. పొంగులేటి బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో పొంగులేటి  బీఆర్ఎస్ ను వీడటం ఖాయంగా మారింది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో  మండల స్థాయి నాయకులను తనవైపు తిప్పుకునేందుకు పొంగులేటి చర్చలు జరుపుతున్నారు.  ఆదివారం 5 మండలాల బీఆర్ఎస్ నేతలు పొంగులేటితో భేటీ అయ్యారు. వీరిలో పలువురు ముఖ్య నేతలు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఈ సమావేశంపై దృష్టి సారించిన బీఆర్ఎస్ అధిష్ఠానం పొంగులేటితో సమావేశమైన నేతలను సస్పెండ్ చేసింది.