గురుకుల ఫలితాలు వెంటనే ఇవ్వాలి.. అభ్యర్థులు డిమాండ్

గురుకుల ఫలితాలు వెంటనే ఇవ్వాలి.. అభ్యర్థులు డిమాండ్

ముషీరాబాద్,వెలుగు : సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి గురుకుల టీచర్ల ఫలితాలను వెంటనే ప్రకటించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. పరీక్షలు రాయడానికి తగిన సమయం ఇవ్వకుండా గత ప్రభుత్వం ఆగ మేఘాల మీద నిర్వహించిందని పేర్కొన్నారు. ఫలితాల ప్రకటనలో జాప్యమెందుకని అధికారులను ప్రశ్నించారు. ఫలితాల కోసం నాలుగు నెలలుగా ఎదురు చూస్తున్నామంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో గురుకుల టీచర్ల 9,216 పోస్టుల భర్తీకి గత ఆగస్టులో నిర్వహించిన పరీక్షల ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్

చేస్తూ గురుకుల ఉపాధ్యాయ అభ్యర్థులు బుధవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అభ్యర్థులు కొండపల్లి శీను, కొమ్ము ఉపేందర్, చిరంజీవి, మధుకర్ రెడ్డి, గిరి, శ్రీనివాస్, మహేందర్, శ్వేత, ప్రసాద్ మాట్లాడుతూ గురుకుల బోర్డు నోటిఫికేషన్ లో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మహిళలకు సమాంతర హరిజంటల్ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ రిక్రూట్​మెంట్ బోర్డు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్టాఫ్ నర్స్, రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్

టీఎస్పీఎస్సీ హరిజంటల్ రిజర్వేషన్లు పాటిస్తున్నప్పుడు గురుకుల బోర్డు పాటించకపోవడమెంటని ప్రశ్నించారు. సరైన నిర్ణయం తీసుకోకపోవడంతోనే పురుష అభ్యర్థులతో పాటు సుమారు రెండు లక్షల మంది నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగి ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే హరిజంటల్ రిజర్వేషన్ సమస్యను పరిష్కరించి ఫలితాలను ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.