హెల్త్ టిప్స్.. కొబ్బరితో ఇన్సులిన్ మాయం

హెల్త్ టిప్స్.. కొబ్బరితో ఇన్సులిన్ మాయం

రక్తంలో చక్కెర శాతాన్ని, శరీరంలో ఇతర హార్మోన్లను సమాంతరంగా ఉత్పత్తి చేయడానికి ఇన్సులిన్ సాయపడుతుంది. శరీరంలో ఇన్సులిన్ ఎక్కువైనా.. తక్కువైనా ప్రమాదమే. ఇన్సులిన్ తక్కువైతే డయాబెటిస్ (షుగర్), ఎక్కువైతే టైప్2 డయాబెటిస్ వస్తాయి. అందుకే ఇన్సులిన్ ను బ్యాలెన్స్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని చెప్తుంటారు డాక్టర్లు. అందుకే శరీరంలో ఇన్సులిన్ ను బ్యాలెన్స్ చేయడానికి కొన్ని రకాలు ఫుడ్ ఐటమ్స్ సాయపడతాయని న్యూట్రిషనిస్ట్ శిఖా గుప్తా చెప్తున్నారు. 

కొబ్బరి:

కొబ్బరి ముక్కల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ ను తగ్గించడానికి సాయపడుతుంది. కొబ్బరిలో ఫైబర్, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి తినడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటుంది. కొబ్బరి ముక్కలే కాకుండా కొబ్బరి నూనె, కొబ్బరి పాలను కూడా వాడుకోవచ్చు.

మొలకెత్తిన బీన్స్:

స్పౌట్స్ శరీరంలో పోషకాలను పెంచుతాయి. బీన్స్ స్పౌట్స్ లో ప్రొటీన్స్, యాంటీఆక్సిడెంట్స్ శాతం ఎక్కువ. ఇవి ఇన్సులిన్ ను మెరుగుపరచడంలో సాయపడుతుంది. 

అవిసె గింజలతో పెరుగు:

ప్రోబయోటిక్ పెరుగు రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని తగ్గిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి సాయపడే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌ ఉంటుంది. అందుకే పోషకాలు అధికంగా ఉండే అవిసె గింజలతో పెరుగును కలిపి తింటే హెల్దీ.

బాదం, వెన్న:

బాదం, వెన్నను కలిపి తినడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ శాతం పెరుగుతుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ను తగ్గిస్తుంది. అందుకే మితంగా బాదం, వెన్న కలిపి తింటే హెల్దీగా ఉంటారు.