కొత్త సంవత్సరం రాబోతుంది. అదే నండి మరో నాలుగు రోజుల్లో ( డిసెంబర్ 27 నాటికి) 2025 వ సంవత్సరానికి గుడ్ బై చెప్పనున్నారు. ఇక 2026 వ సవంత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు జనాలు రడీ అవుతున్నారు. ఆరోజు ఎలా సెలబ్రేషన్స్ చేసుకోవాలి. కొత్త ఏడాది..కొత్త రుచులు.. నాన్ వెజ్ వంటకాలతో వెల్కమ్ చెప్పేందుకే పసందైన నాన్ వెజ్ రెసీపీ ల గురించి తెలుసుకుందాం. . .
కొత్త ఏడాది( 2026) ని..వెరైటీ వంటకాలతో ఆహ్వానించాలంటే రకరకాల బెస్ట్ రెసిపీల కోసం చాలామంది హోటళ్లను వెళ్తుంటారు. నాన్ వెజ్ స్టార్టర్స్ ఆర్డర్స్ చేస్తుంటారు. అయితే హోటళ్ల దొరికే నాన్ వెజ్ స్టార్టర్స్ అన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు.
మష్రూమ్ బాల్స్ తయారీకి కావాల్సినవి:
- మష్రూమ్స్- పావు కిలో
- మిరియాల పొడి -ఒక టీస్పూన్
- బియ్యప్పిండి, కార్న్ ఫ్లోర్, మైదా-ఒక్కోటి మూడు టేబుల్ స్పూన్ల చొప్పున
- నూనె -వేగించడానికి సరిపడా
- ఉప్పు- తగినంత
- కారం-ఒక టీ స్పూన్
- నీళ్లు - అరకప్పు
- ఉల్లిగడ్డలు -రెండు
- వెల్లుల్లి రెబ్బలు- నాలుగు
- సోయా సాస్-రెండు టి స్పూన్లు
- పచ్చిమిర్చి- నాలుగు
- టొమాటోసాస్- ఒక టేబుల్ స్పూన్
- టొమాటోప్యూరీ- రెండు టేబుల్ స్పూన్లు
- కొత్తమీర తరుగు - కొద్దిగా
తయారీ విధానం: ఒక గిన్నెలో బియ్యప్పిండి, కార్న్ ఫ్లోర్, మైదా, ఉప్పు, కారం, కొంచెం నీళ్లు పోసి జారుగా కలపాలి. మష్రూమ్స్ ముక్కలను ఈ లిక్విడ్ లో ముంచి నూనెలో దోరగా వేగించాలి. తరువాత ఒక పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. ఇది కాగాక ఉల్లి, వెలుల్లి తరుగు, పొడుగ్గా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు వేసి వేగించాలి. తర్వాత సోయాసాస్, టొమాటో ప్యూరీ, టొమాటో సాస్ వేయాలి. రెండు నిమిషాల తర్వాత మష్రూమ్స్ వేసి చిక్కబడేవరకూ తిప్పుతూ ఉండాలి. చివర్లో కొత్తిమీర చల్లి స్టవ్ ఆపేయాలి . వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని ఉల్లిగడ్డ తరుగు, కొత్తిమీరతో గార్నిష్ చేసి తింటే టేస్ట్ అదిరిపోతుంది.
బోటీ కబాబ్స్ తయారీకి కావలసినవి
- బోటీ–అరకిలో
- గరంమసాలా - ఒక టేబుల్ స్పూన్
- పెరుగు - ఒక కప్పు
- శెనగపిండి, కార్న్ ఫ్లోర్ - ఒక్కోటి పావు కప్పు
- ఉప్పు - తగినంత
- ఉల్లిగడ్డ తరుగు -కొంచెం
- కొత్తిమీర - ఒక కట్ట
- నిమ్మకాయ - ఒకటి
- మిరియాల పొడి - ఒక టేబుల్ స్పూన్
తయారీ విధానం: బోటీని శుభ్రంగా కడిగి ఒకే ఒకసారి మిక్సీ పడితే చిన్న ముక్కలు అవుతుంది. ఈ బోటీని ఒక గిన్నెలో వేసి శెనగపిండి, కార్న్ ఫ్లోర్, పెరుగు, గరంమసాలా, ఉప్పు వేసి కలపాలి. తర్వాత వీటిని లడ్డూల్లా చేయాలి.. షేప్ లో చుట్టాలి. ఇవి విడిపోకుండా గట్టిగా చుట్టాలి. తర్వాత వీటిని నీకుకు ఒక్కొక్కటిగా గుచ్చాలి. బొగ్గుల పొయ్యి వెలిగించి నిప్పుల మీద నీకును అటూ ఇటూ తిప్పుతూ కాల్చాలి ముక్కలు ఎర్రగా కాలాక ఒక గిన్నెలోకి తీసి ఉల్లిగడ్డ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేస్తే టేస్టీ టేస్టీ బోటీ కబాబ్స్ రెడీ ..ఇష్టపడేవారు నిమ్మకాయ రసం చల్లుకుని అయినా తినొచ్చు.
చికెన్ టిక్కా తయారీకి కావలసినవి
- చికెన్ - అరకిలో
- గరం మసాలా - ఒక టేబుల్ స్పూన్
- పెరుగు - ఒక కప్పు
- నూనె- సరిపడా
- ఉల్లిగడ్డ తరుగు -కొంచెం
- కొత్తిమీర - ఒక కట్ట
- నిమ్మకాయ - ఒకటి
తయారీ విధానం : చికెన్ శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పుగరం... మసాలా..పెరుగు వేసి ఒక గంటపాటు నానబెట్టాలి. ఈ ముక్కలను ఒక్కొక్కటిగా నీకుకు గుచ్చాలి. సీకులను ఎర్రని నిప్పుల మీద పెట్టి మధ్య మధ్యలో అటూఇటూ తిప్పుతూ కాల్చాలి. ముక్కలు ఎర్రటి రంగులోకి మారాక వేరేగిన్నెలోకి తీయాలి ఉల్లిగడ్డ తరుగు, కొత్తిమీర, నిమ్మకాయ రసం పైన గార్నిష్ చేసి తింటే బాగుంటుంది.
