రేకులపల్లి స్కూల్​లో ఫుడ్ పాయిజన్

రేకులపల్లి స్కూల్​లో ఫుడ్  పాయిజన్

గద్వాల, వెలుగు: గద్వాల మండలం రేకులపల్లి గవర్నమెంట్  స్కూల్​లో సోమవారం ఫుడ్  పాయిజన్ తో స్టూడెంట్స్  అస్వస్థతకు గురయ్యారు. పేరెంట్స్  తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 12:30 గంటలకు స్కూల్​లో మిడ్​ డే మీల్స్  చేశాక నలుగురు స్టూడెంట్స్  వాంతులు చేసుకున్నారు. వెంటనే హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి మిగతా స్టూడెంట్లను ఆరా తీయగా, మరో పది మంది స్టూడెంట్స్  కడుపునొప్పి, నెత్తినొప్పి వస్తుందని చెప్పడంతో 14 మందిని గవర్నమెంట్  హాస్పిటల్ కు తరలించారు. ట్రీట్మెంట్  చేసిన డాక్టర్లు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్కూల్ లో ఉన్న వాటర్  ట్యాంక్​లు సరిగా క్లీన్  చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.