కోస్గి పట్టణంలో హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు  

కోస్గి పట్టణంలో హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు  

కోస్గి, వెలుగు: కోస్గి పట్టణంలో పలు హోటళ్లు. టిఫిన్ సెంటర్లు, దాబాలు, ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లలో  మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు  తనిఖీ  చేశారు.  పలు  హోటళ్లలో ఆహార పదార్థాలు ఎక్కువకాలం నిల్వ ఉంచి  అపరిశుభ్ర వాతావరణంలో  వంటలు చేస్తున్నట్టు గుర్తించారు.  పలు హోటళ్లలో  ఎక్కువ రోజుల నుంచి నిల్వ ఉంచిన మాంసం , ఇతర ఆహార పదార్థాలను అధికారులు మురుగుకాల్వల్లో పారబోయించారు.  నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న హోటల్​  యజమానులకు రూ.17వేలు జరిమాన విధించామన్నారు.  

ప్రతిఒక్కరూ నాణ్యమైన ఆహారాన్ని అందించాలని,  నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే భారీ జరిమానాలు తప్పవని  ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్​ నీలిమ హెచ్చరించారు. అలాగే మున్సిపల్​ కమిషనర్  శశిధర్ పలు హోటళ్లలో నిషేదిత పాలిథీన్ నిల్వను  తనిఖీ చేశారు.  ఈ తనిఖీల్లో  సిబ్బంది వెంకటయ్య, రఘు, అంజిలయ్య తదితరులు ఉన్నారు. 

అచ్చంపేట :   హోటల్లు రెస్టారెంట్లలో కల్తీ వస్తువులు వాడి, ఆహారంలో నాణ్యత లేకుండా  అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని  ఫుడ్ ఇన్​స్పెక్టర్​  మనోజ్ హెచ్చరించారు.   పట్టణంలోని అమృతపాణి అరేబియన్ మండి రెస్టారెంట్, హోటల్ పరివార్, నేషనల్ హోటల్,  హాజీపూర్ చౌరస్తాలోని బటర్ ఫ్లై హోటల్,   పట్టణంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో  ఆకస్మిక తనిఖీ చేశారు.  హోటల్లోని ఆహార పదార్థాల  శాంపిల్స్  ల్యాబ్ కు పంపిస్తున్నామని, ల్యాబ్ రిపోర్టులో కల్తీ ఉన్నట్టు తెలితే  హోటల్లు సీజ్  చేసి యజమానులపై కేసు నమోదు చేస్తామని 
అన్నారు.