41 కోట్ల మందికి 23.2 లక్షల కోట్ల ముద్రా లోన్లు

41 కోట్ల మందికి 23.2 లక్షల కోట్ల ముద్రా లోన్లు

న్యూఢిల్లీ : దేశంలోని బ్యాంకులు, ఫైనాన్షియల్​ ఇన్​స్టిట్యూషన్లు కలిపి 40.82 కోట్ల మంది బెనిఫిషియరీలకు మొత్తం రూ. 23.20 లక్షల కోట్ల అప్పులను ముద్రా యోజనా కింద ఇచ్చాయి. వ్యాపారం చేయడానికి డబ్బు లేక, దొరక్క ఇబ్బందులు పడుతున్న వారి కోసం ఈ ముద్రా యోజనా స్కీమును 8 ఏళ్ల కిందట అమలులోకి  తెచ్చారు. ప్రధాన మంత్రి ముద్రా యోజనా (పీఎంఎంవై) పేరుతో ఏప్రిల్​8, 2015 నాడు నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ స్కీమును లాంఛ్ చేశారు.

ఎలాంటి కొలేటరల్​ లేకుండా రూ. 10  లక్షల దాకా అప్పును చిన్న వ్యాపారులకు ఇవ్వడంపై ఈ స్కీమ్​ ఫోకస్​ పెట్టింది. బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు, మైక్రోఫైనాన్స్​ కంపెనీలు, ఇతర ఫైనాన్సియల్​ ఇంటర్మీడియరీలు పీఎంఎంవై స్కీము కింద ముద్రా లోన్లను ఇస్తున్నట్లు ఫైనాన్స్​ మినిస్ట్రీ శనివారం ఒక స్టేట్​మెంట్లో వెల్లడించింది. స్కీము కింద 68 శాతం మహిళా వ్యాపారుల పేరు మీదే అకౌంట్లు ఉన్నాయని ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ చెప్పారు. 51 శాతం లోన్​  అకౌంట్లు ఎస్​సీ, ఎస్​టీ, ఓబీసీ కేటగిరీలలోని వ్యాపారులకు చెందినవని పేర్కొన్నారు.

ఈ చొరవ వల్ల ఇన్నోవేషన్​ పెరగడంతోపాటు, తలసరి ఆదాయం నిలకడగా ఎగసిందని అన్నారు. మేకిన్​ ఇండియా ప్రోగ్రామ్​ సక్సెస్​లో ఎంఎస్​ఎంఈలు  ముఖ్య పాత్ర పోషించాయని నిర్మలా సీతారామన్​ ప్రస్తావించారు.