కారు పేపర్లు అడిగినందుకు  కానిస్టేబుల్ కిడ్నాప్

కారు పేపర్లు అడిగినందుకు  కానిస్టేబుల్ కిడ్నాప్
  • నోయిడాలో ఘటన.. నిందితుడి అరెస్టు

నోయిడా: కారును ఆపి డాక్యుమెంట్లు అడిగినందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ ను కిడ్నాప్ చేసిండో వ్యక్తి. ఆదివారం ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో ఈ ఘటన జరిగింది. గ్రేటర్ నోయిడాలోని ఘోడి బచెడా గ్రామానికి చెందిన సచిన్ రావల్ రెండేండ్ల క్రితం కారు కొనేందుకు గుర్గావ్ లోని షోరూమ్ కు వెళ్లాడు. అక్కడ మారుతి స్విఫ్ట్ డిజైర్ కారును టెస్ట్ డ్రైవ్ కోసమని తీసుకెళ్లి దొంగిలించాడు. ఆ కారుకు తన ఊరికే చెందిన మరో వ్యక్తి కారు నంబర్ ను పెట్టాడు. దీనిపై పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆదివారం సూరజ్​పూర్​లో ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరేంద్ర సింగ్ డ్యూటీ చేస్తుండగా, ఆ టైమ్​లో సచిన్ అటువైపు వచ్చాడు. అది దొంగిలించిన కారని గుర్తించిన వీరేంద్ర సింగ్.. సచిన్​ను ఆపి, కారు డాక్యుమెంట్లు ఇవ్వాలని అడిగాడు. ఒరిజినల్ డాక్యుమెంట్లు లేవని, సాఫ్ట్ కాపీలు ఫోన్​లో ఉన్నాయని, కారు లోపలికి వస్తే చూపిస్తానని సచిన్ చెప్పాడు. వీరేంద్ర కారులోకి ఎక్కగానే డోర్లన్నీ లాక్ చేసిన సచిన్.. అతడిని దాదాపు 10 కి.మీ. తీసుకెళ్లి, అజయబ్ పూర్ పోలీస్ చౌకీ వద్ద కిందకు తోసేసి స్పీడ్ గా వెళ్లిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని సోమవారం అరెస్టు చేశారు. కారును స్వాధీనం చేసుకున్నారు. సచిన్​పై కిడ్నాపింగ్, దాడి తదితర కేసులు పెట్టారు.