చిన్న వ్యాపారాలకు అమెజాన్​ రూ. 1,873 కోట్ల సాయం

చిన్న వ్యాపారాలకు అమెజాన్​ రూ. 1,873 కోట్ల సాయం

న్యూఢిల్లీ : ఆన్​లైన్​ బాట పట్టేందుకు చిన్న వ్యాపారాలకు రూ. 1,873 కోట్ల సాయాన్ని అమెజాన్​ ప్రకటించింది. అగ్రిటెక్​, హెల్త్​టెక్​ రంగాలలో ఇనొవేషన్​కూ డబ్బు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఏ ఎకానమీకైనా చిన్న వ్యాపారాలు చాలా ముఖ్యమైనవి. ఇండియాలోనూ ఇదే నిజం. ఈ నేపథ్యంలో చిన్న వ్యాపారాల డెవలప్​మెంట్​కు  మేం చొరవ తీసుకుంటామని అమెజాన్​ వెబ్​ సర్వీసెస్​  సీఈఓ ఆండ్రూ జాసీ చెప్పారు. ఇందుకోసమే కొత్తగా ఈ రూ. 1,873 కోట్ల అమెజాన్​ సంభవ్​ వెంచర్​ ఫండ్​ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అమెజాన్​ సంభవ్​ మీట్​ సందర్భంగా ఈ వివరాలు ఆయన చెప్పారు. కొత్త ఐడియాలు కార్యరూపంలోకి రావడానికి, విజనరీ ఎంట్రప్రెనూర్లను తేవడానికి ఈ ఫండ్​ సాయపడుతుందని అమెజాన్​ ఇండియా గ్లోబల్​ ఎస్​వీపీ అమిత్​ అగర్వాల్​ అన్నారు. ఎస్​ఎంఈ డిజిటైజేషన్​, రైతుల ప్రొడక్టివిటీ పెంచే అగ్రిటెక్​ ఇనొవేషన్స్​, క్వాలిటీ హెల్త్​కేర్​ అందించే హెల్త్​టెక్​ రంగాలకు ఫండ్​ నుంచి అమెజాన్​ నిధులు ఇస్తుందని చెప్పారు.