గురుకుల కాలేజీల సీట్లకు భారీగా అప్లికేషన్లు ఇంటర్​ కాలేజీల్లో 21,800 సీట్లకు 46,645 దరఖాస్తులు

గురుకుల కాలేజీల సీట్లకు భారీగా అప్లికేషన్లు ఇంటర్​ కాలేజీల్లో 21,800 సీట్లకు 46,645 దరఖాస్తులు

హైదరాబాద్, వెలుగు: 2024-25 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని గురుకుల కాలేజీల్లో అడ్మిషన్లకు అప్లికేషన్లు భారీగా వచ్చాయి. జూనియర్​కాలేజీల్లో అడ్మిషన్ల కోసం 46,785 అప్లికేషన్లు, డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం 18,556 అప్లికేషన్లు వచ్చాయని టీజీఆర్డీసీ సెట్ కన్వీనర్, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల సొసైటీ సెక్రటరీ సైదులు సోమవారం ఒక ప్రకటనలో  తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 261 బీసీ గురుకుల ఇంటర్ కాలేజీల్లో 21,800 సీట్లు ఉండగా.. 46,785 అప్లికేషన్లు వచ్చాయన్నారు. అలాగే, 76 డిగ్రీ (ఎస్టీ, ఎస్టీ, బీసీ) కాలేజీల్లో 20,340 సీట్లు ఉండగా..18,556 అప్లికేషన్లు వచ్చినట్టు చెప్పారు. ప్రవేశ పరీక్ష ఈ నెల 28న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. హాల్ టికెట్లు పరీక్షకు వారం రోజుల ముందు వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు ఆయన సూచించారు.