ఫోర్బ్స్ జాబితా .. మళ్లీ ముఖేష్ అంబానీనే టాప్

ఫోర్బ్స్ జాబితా .. మళ్లీ ముఖేష్ అంబానీనే టాప్

ఫోర్బ్స్ తన 2024 బిలియనీర్ల జాబితాను 2,781 మంది వ్యక్తులతో విడుదల చేసింది.  రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఫోర్బ్స్ సంపన్న భారతీయుల జాబితాలో ఆయన రిచెస్ట్ ఏషియన్ గా నిలిచారు.  ఆయన సంపద $83 బిలియన్లు నుంచి $116 బిలియన్లకు చేరుకుంది.  దీంతో  $100 బిలియన్ల  సంపద కలిగిన ఏకైక  ఆసియా దేశస్థుడిగా ముఖేష్ నిలిచారు.  

ముఖేష్ అంబానీ తరువాత భారతీయు బిలియనీర్ల జాబితాలో  గౌతమ్ ఆదానీ ఉన్నారు. గతేడాది 169గా  ఉన్న భారతీయ  బిలియనీర్ల సంఖ్య ఇప్పుడు 200కు చేరింది.   రికార్డు స్థాయిలో 813 మంది బిలియనీర్లతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, 473 మంది బిలియనీర్లతో చైనా రెండో స్థానంలో ఉంది. గత ఏడాదితో పోలిస్తే భారతదేశంలో 31 మంది బిలియనీర్లు పెరిగారు, ఇప్పుడు మొత్తం 200 మంది ఉన్నారు.

దేశంలోని 10 మంది ధనవంతులు 

 • ముఖేష్ అంబానీ -116 బిలియన్ల డాలర్లు
 • గౌతమ్ అదానీ నికర విలువ 84 బిలియన్ డాలర్లు
 • శివ్ నాడార్ నికర విలువ 36.9 బిలియన్ డాలర్లు
 • సావిత్రి జిందాల్- నికర విలువ 33.5 బిలియన్ డాలర్లు
 • దిలీప్ షాంఘ్వి- నికర విలువ 26.7 బిలియన్ డాలర్లు
 • సైరస్ పూనావల్ల- నికర విలువ 21.3 బిలియన్లు
 • కుశాల్ పాల్ సింగ్- నికర విలువ 20.9 బిలియన్ డాలర్లు
 • కుమార్ బిర్లా - నికర విలువ 19.7 బిలియన్
 • రాధాకిషన్ దమాని నికర విలువ 17.6 బిలియన్ డాలర్లు
 • లక్ష్మీ మిట్టల్- నికర విలువ 16.4 బిలియన్ డాలర్లు

 

ALSO READ :- తైవాన్‌లో భూకంపం, జపాన్‌లో సునామి.. పాతికేళ్ల తర్వాత మళ్లీ బీభత్సం