వద్దని చెప్పినా వినలేదు.. ముస్లిం కుటుంబంపై బలవంతంగా రంగులు చల్లారు

వద్దని చెప్పినా వినలేదు.. ముస్లిం కుటుంబంపై బలవంతంగా రంగులు చల్లారు

ఎంతో ఆహ్లాదకరంగా గడపాల్సిన హోలీని కొందరు ఆకతాయిలు మితిమీరి పోతుంటారు. తాము చేసేది తప్పా, ఒప్పా అనేది కూడా అర్థం తెలియకుండా కొన్ని  దుర్ఘటనలకు పాల్పడుతున్నారు. హోలీ అడుతున్న సమయంలో అటుగా వస్తున్న ఓ ముస్లిం కుటుంబంపై రంగులు గుప్పి వారిని అవహేలన చేస్తూ అనార్థానికి పాల్పడడ్డారు. ముస్లిం కుటుంబ సభ్యులు ఎంత చెబుతున్న వినకుండా రంగులు పూస్తూ.. నీళ్లు చల్లుతూ వారికి నరకం చూపించారు. వివరాల్లోకి వెళ్తే..

 ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలోని ధాంపూర్ నగరంలో కొందరు వ్యక్తులు వీధీలో హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే బైక్ పై అటుగా వస్తున్న ఓ ముస్లిం కుటుంబాన్ని ఆపి వేధించారు. వారిపై బలవంతంగా రంగులు గుప్పారు. బైక్ పై ఉన్న తల్లి వద్దు అలా చేయకండి అని ఎంత చెప్పిన వినకుండా యువకులు రంగులు చల్లారు. బలవంతంగా వారి పై రంగులు వేసి నీళ్లు చల్లారు. 

ఈ మొత్తం సన్నివేశాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలోకి వదిలారు. దీంతో క్షణాల్లోనే వైరల్ గా మారింది. పలువురు నెటిజన్లు వీడియోపై స్పందిస్తూ ఫైర్ అవుతున్నారు.  ఈ వీడియో గురించి బిజ్నోర్ పోలీసులను అప్రమత్తం చేశారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీడియో పై స్పందించిన పోలీస్ అధికారులు దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

వీడియోలోని నిందితులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని బిజ్నోర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. బాధితులతో మాట్లాడి అవసరమైన విచారణ చేపట్టాలని ఆదేశించారు.