పోయిన నెలలో విదేశీ పెట్టుబడులు రూ. 11,119 కోట్లు

పోయిన నెలలో విదేశీ పెట్టుబడులు రూ. 11,119 కోట్లు

న్యూఢిల్లీ: ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో  కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, ఫారిన్​ పోర్ట్​ఫోలియో ఇన్వెస్టర్స్​(ఎఫ్​పీఐలు) డిసెంబర్‌‌‌‌లో భారతీయ ఈక్విటీలలో రూ. 11,119 కోట్ల పెట్టుబడులు పెట్టారు.  అయితే పరిస్థితులు ప్రతికూలంగా మారుతుండటంతో ఇటీవల వీళ్లు జాగ్రత్తగా ఉంటున్నారు. నవంబర్‌‌లో ఎఫ్‌‌పీఐలు ఇన్వెస్ట్ చేసిన రూ.36,239 కోట్లతో పోలిస్తే డిసెంబరులో ఇన్‌‌ఫ్లో చాలా తక్కువగా ఉంది.

 "మార్కెట్లలో కరెక్షన్​ కనిపిస్తోంది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో కరోనా మళ్లీ వస్తోంది. యూఎస్​లో మాంద్యం ఆందోళనలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ ఎఫ్​పీఐలు భారతీయ ఈక్విటీ మార్కెట్లలో (డిసెంబర్‌‌లో) నికర కొనుగోలుదారులుగా ఉన్నారు" అని మార్నింగ్‌‌స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్  హిమాన్షు  శ్రీవాస్తవ చెప్పారు.  భారతీయ మార్కెట్లు ఇటీవల ఆల్-టైమ్ హైని తాకడంతో చాలా మంది పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకున్నారు. 

యూఎస్​ ఫెడరల్ రిజర్వ్ రేట్లు పెంచడం,  క్రూడ్ ధరలు ఎక్కువ కావడం, యుద్ధం పాటు ఇన్​ఫ్లేషన్​  కారణంగా 2022లో  ఎఫ్​పీఐలు రూ. 1.21 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారని డిపాజిటరీ డేటా వెల్లడించింది.