హరితహారంతో అటవీ విస్తీర్ణం పెరిగింది : సీఎస్​ శాంతి కుమారి

హరితహారంతో అటవీ విస్తీర్ణం పెరిగింది :  సీఎస్​ శాంతి కుమారి

హైదరాబాద్, వెలుగు: హరితహారం ప్రోగ్రాంలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొక్కలు నాటడం ద్వారా అటవీ విస్తీర్ణం పెరిగిందని సీఎస్​ శాంతి కుమారి అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 7% గ్రీనరీ పెరిగినట్లు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించినట్లు తెలిపారు. సోమవారం మాదాపూర్‌‌‌‌‌‌‌‌ లోని ఓ హోటల్‌‌‌‌లో కేంద్ర ప్రభుత్వ గృహ, పట్టణ వ్యవహారాల ప్రతినిధి రాజీవ్‌‌‌‌ రంజన్ సింగ్‌‌‌‌ (లలన్‌‌‌‌ సింగ్‌‌‌‌) అధ్యక్షతన పార్లమెంటరీ స్టాండింగ్‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌ జరిగింది. ఇందులో హౌసింగ్, స్వచ్ఛ భారత్, అమృత్, హెచ్‌‌‌‌ఎంఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌, వాటర్ బోర్డు స్కీమ్‌‌‌‌లు, కేంద్ర ప్రభుత్వం ద్వారా మౌలిక సదుపాయాలు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే స్కీమ్‌‌‌‌లు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్‌‌‌‌లపై చర్చించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, అభివృద్ధిని కమిటీకి సీఎస్‌‌‌‌ వివరించారు. ఇంక్రిమెంటల్ గ్రీన్ కవరేజ్, అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ కింద 177 అర్బన్ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్స్‌‌‌‌లో ప్లాంటేషన్ పూర్తి చేశామన్నారు. మున్సిపల్ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మున్సిపల్ స్కీమ్స్‌‌‌‌ను వివరించారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు, నాగోల్ నుంచి రాయదుర్గం వరకు, ఎలివేటెడ్ మెట్రో నిర్మాణాన్ని చేపట్టామని మెట్రో ఎండీ' ఎన్వీఎస్‌‌‌‌ రెడ్డి తెలిపారు. 

బీఆర్కే భవన్‌‌‌‌లో కంటి వెలుగు 

కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎస్ శాంతి కుమారి బీఆర్కే భవన్‌‌‌‌లో సోమవారం ప్రారంభించారు. పది రోజులు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి రోజు సుమారు 100 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.