
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్(సెంట్రల్) డాక్టర్వి.జార్జ్ జెన్నర్ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్అండ్క్లైమెంట్చేంజ్చైన్నై బృందం గురువారం పర్యటించింది. ఏరియాలోని పీవీకే–5 ఇంక్లైన్ను సందర్శించింది. అండర్ గ్రౌండ్ మైన్లో మ్యాన్ రైడింగ్ విధానాన్ని బృందం సభ్యులు పరిశీలించారు. కంటిన్యూస్ మైన్ద్వారా పీవీకే–5 ఇంక్లైన్లో బొగ్గు ఉత్పత్తి, కోల్ ట్రాన్స్పోర్టు చేస్తున్న వివరాలను ఆఫీసర్లు వివరించారు.
అనంతరం కొత్తగూడెంలోని సింగరేణి ఇల్లెందు గెస్ట్ హౌస్లో కంపెనీ డైరెక్టర్లు కె.వెంకటేశ్వర్లు, ఎల్వీ. సూర్యనారాయణ సింగరేణి బొగ్గు గనుల్లో పర్యావరణ పరిరక్షణ కోసం చేపడ్తున్న చర్యలు, మొక్కల పెంపకం వివరాలను బృందానికి వివరించారు. ఈ ప్రోగ్రాంలో డాక్టర్జి.త్రినాథ్, పార్టీన్, కన్జర్వేటర్ఆఫ్ఫారెస్ట్భీమా నాయక్, ఖమ్మం జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్సిద్ధార్థ్ విక్రం సింగ్, కొత్తగూడెం ఏరియా జీఎం షాలెం రాజు, ఎస్వోటూజీఎం కోటిరెడ్డి పాల్గొన్నారు.