బొక్క కోసం వచ్చి బోనులో పడ్డ చిరుత

బొక్క కోసం వచ్చి బోనులో పడ్డ చిరుత

చిత్తూరు జిల్లా : ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులోని ములబగల్ ప్రాంతంలో ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది. ఎముక కోసం వచ్చి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో పడింది. గత కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తున్న చిరుతను పట్టుకోవాలని సరిహద్దు ప్రాంతంలోని   ప్రజలు అటవీశాఖ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. 

చిరుతపులిని పట్టేందుకు రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు.. దాని అడుగుజాడలను పరిశీలిస్తూ.. మూడు రోజుల క్రితం చిత్తూరు జిల్లా వి.కోట సమీపంలోని కర్ణాటక పరిధిలో ఉన్న కోలార్ జిల్లా ములబగల్ వద్ద బోను ఏర్పాటు చేశారు. కెంపపురా గ్రామ సమీపంలో ఆహారం కోసం సంచరిస్తున్న చిరుత ముల్ బగల్ వద్ద బోనులో ఉన్న ఎముక కోసం వచ్చింది. దీంతో అటవీశాఖ అధికారులు చిరుతను బంధించారు.