అర్ధరాత్రి అటవీ భూమి చదును.. రెండు డోజర్లు, జేసీబీ సీజ్

అర్ధరాత్రి అటవీ భూమి చదును.. రెండు డోజర్లు, జేసీబీ సీజ్

శాయంపేట, వెలుగు : అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా కొంతమంది అటవీ భూమిని చదును చేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ రేంజర్ మైసయ్య,  ఓరుగల్లు వైల్డ్​లైఫ్ సొసైటీ బృందం వారిని శనివారం రాత్రి పట్టుకునే ప్రయత్నం చేయగా, వాహనాలను విడిచి పారిపోయారు. మైసయ్య వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గంగిరేణిగూడెం శివారులోని అటవీ భూముల్లో కొంతమంది రెండు డోజర్లు, జేసీబీ సహాయంతో వచ్చి చదును చేసేందుకు పూనుకున్నారు. 

 విషయం తెలుసుకున్న ఓరుగల్లు వైల్డ్​లైఫ్​ సొసైటీ బృందం ఫారెస్ట్ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన వారు వాహనాలను అక్కడే వదిలేసి పారిపోయారు . దీంతో రెండు డోసర్లు, జేసీబీని సీజ్ చేసి హన్మకొండ ఫారెస్ట్​ ఆఫీసుకు తరలించినట్లు మైసయ్య తెలిపారు.