భద్రాద్రిలో పోడు లొల్లి..ఫారెస్ట్ అధికారిపై కత్తులతో దాడి

భద్రాద్రిలో పోడు లొల్లి..ఫారెస్ట్ అధికారిపై కత్తులతో దాడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో పోడు భూముల గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. ఎర్రబోడు సమీపంలోని పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు నాటిన మొక్కల్ని  గొత్తికోయలు తొలగించే యత్నం చేశారు. దీంతో ఫారెస్ట్ అధికారులు, గొత్తికోయలకు మధ్య వాగ్వాదం, తొపులాట జరిగింది.

ఇదే టైంలో అటవిశాఖ అధికారి శ్రీనివాస్ పై వేటకొడవళ్లతో గొత్తికోయలు దాడి చేశారు. మెడ భాగంలో కత్తితో దాడి చేయడంతో శ్రీనివాస్ కు తీవ్ర గాయాలయ్యాయి.  పరిస్థితి విషమంగా ఉండటంతో  శ్రీనివాస్ ను ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. శ్రీనివాస్ పరిస్థితి క్రిటికల్ ఉన్నట్లు సమాచారం.