పార్టీకి ద్రోహం చేసిన వారిని క్షమించం : తమ్మినేని వీరభద్రం

పార్టీకి ద్రోహం చేసిన వారిని క్షమించం :  తమ్మినేని వీరభద్రం

కూసుమంచి, వెలుగు : ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజల తీర్పును గౌరవిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కూసుమంచిలోని పద్మా రెడ్డి భవనంలో జరిగిన సీపీఎం మండల స్థాయి జనరల్ బాడీ సమావేశానికి చీఫ్​ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. సీపీఎం ఓడినా గెలిచినా ప్రజల పక్షానే ఉంటుందన్నారు. తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్​అప్రజాస్వామికంగా వ్యవహరించిందని, అందుకే ప్రజలు ఓడగొట్టారన్నారు. 

పాలేరులో ఒక్కొక్క ఓటుకు రూ.3 నుంచి రూ.4 వేలు పంచారని, ఈ ధన ప్రవాహం ప్రజాస్వామ్యానికి హానికరమన్నారు. అక్కడక్కడ పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తులను క్షమించేది లేదన్నారు. మల్లెల సన్మతరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఎం పాలేరు డివిజన్ ఇన్​చార్జి బండి రమేశ్, మండల ఇన్​చార్జి బుగ్గవీటి  సరళ, మండల కార్యదర్శి యడవల్లి రమణారెడ్డి, తోటకూరి రాజు, మాజీ జడ్పీటీసీ ఎర్రబోయిన భారతి  పాల్గొన్నారు.