
కరీంనగర్ టౌన్, వెలుగు : తెలంగాణ రాష్ట్ర మైనారిటీ రెసిడెన్షియల్ ప్రిన్సిపాల్స్నూతన కార్యవర్గాన్ని బుధవారం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఎన్నుకున్నారు.
ప్రెసిడెంట్ గా కె.విద్యాసాగర్, జనరల్ సెక్రటరీగా సయ్యద్ తాజొద్దీన్, ఉపాధ్యక్షులుగా కె.సురేశ్,లావణ్యలను ఎన్నుకోగా, కరీంనగర్ జిల్లా ఇన్చార్జీగా వీర్లమహేశ్, కార్యవర్గ సభ్యులుగా సరితను ఎన్నుకున్నారు. మహేశ్ మాట్లాడుతూ మైనార్టీ విద్యార్థుల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు.