డ్రంకెన్ డ్రైవ్‌‌‌‌ కేసులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ వార్నర్ అరెస్ట్

డ్రంకెన్ డ్రైవ్‌‌‌‌ కేసులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ వార్నర్ అరెస్ట్

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మద్యం తాగి కారు నడుపుతూ పోలీసులకు దొరికిపోయాడు. సిడ్నీలో మంగళవారం జరిగిన తనిఖీల్లో వార్నర్ పట్టుబడ్డాడు. మారౌబ్రా అనే ప్రాంతంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 39 ఏండ్ల వార్నర్‌‌‌‌‌‌‌‌ను టెస్టు చేయగా.. అనుమతించిన మోతాదు కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో  తను మందు తాగినట్టు తేలింది. 

దీంతో పోలీసులు వార్నర్‌‌‌‌‌‌‌‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసిన తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. వచ్చే నెలలో ఈ విషయమై వార్నర్ కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. ప్రస్తుతం వార్నర్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌‌‌‌ఎల్‌‌‌‌) టోర్నీలో కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌‌‌‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ కేసు వల్ల వార్నర్ పీఎస్ఎల్ మ్యాచ్‌‌‌‌లు ఆడేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలుస్తోంది.