
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత హేమానంద బిశ్వాల్(83) కన్నుమూశారు. భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బిస్వాల్ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
డిసెంబర్ 1, 1939న ఝార్సుగూడ జిల్లాలోని ఠాకూర్‌పాడలో జన్మించిన బిశ్వాల్ ఒడిశా ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేశాడు. డిసెంబర్ 7, 1989 నుండి మార్చి 5, 1990 వరకు ఒకసారి... డిసెంబర్ 6, 1999 నుండి మార్చి5, 2000 వరకు మరోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. బిశ్వాల్ ఒడిశా మొదటి గిరిజన ముఖ్యమంత్రి. 1974లో తొలిసారి ఒడిశా అసెంబ్లీకి ఎన్నికైన బిశ్వాల్.. రాష్ట్ర అసెంబ్లీకి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో సుందర్‌గఢ్ నుంచి ఎంపీగా గెలిచారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే ముందు కిరిమిర పంచాయతీ సమితి చైర్మన్‌గా ఉన్నారు.
Former Chief Minister of Odisha Hemananda Biswal passed away in Bhubaneswar today
— ANI (@ANI) February 25, 2022