యశోద ఆస్పత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్

యశోద ఆస్పత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ డిసెంబర్ 15 శుక్రవారం ఉదయం యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తుంటి ఎముక విరగడంతో గత వారం రోజులుగా కేసీఆర్ యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కోలుకోవడంతో ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. కేసీఆర్ ను చూసేందుకు  ఆస్పత్రి దగ్గరకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

 మెడికల్ ఫాలో అప్, ఫిజియోథెరపీ కోసం తరచూ డాక్టర్ల బృందం వచ్చి వెళ్లేందుకు వీలుగా బంజారాహిల్స్   నందినగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని  తన ఇంట్లోనే ఆయన ఉండనున్నారు. కేసీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల టైమ్ పడుతుందని డాక్టర్లు తెలిపారు. 

ఎర్రవెల్లిలోని ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిసెంబర్ 7న అర్ధరాత్రి ప్రమాదవశాత్తు జారిపడటంతో కేసీఆర్ ఎడమ కాలి తుంటి ఎముక విరిగింది. దీంతో అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. 8న సాయంత్రం ఆయనకు సీనియర్ డాక్టర్ల బృందం హిప్ రీప్లేస్​మెంట్ సర్జరీ చేసింది. ఆయన కోలుకుంటుండటంతో శుక్రవారం డిశ్చార్జి చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. 

మరోవైపు డిసెంబర్ 14న  యశోద హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పలువురు ప్రముఖులు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరామర్శించారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ప్రముఖ నటుడు నరేశ్ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ చైర్మన్ పి.విష్ణువర్ధన్​రెడ్డి ఆధ్వర్యంలో పూజారులు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేశారు.

Also Read:-తిరుమల శ్రీవారి సేవలో.. దీపికా పదుకొణె, దగ్గుబాటి కుటుంబ సభ్యులు