ఉత్తరాఖండ్​లో ఏ పనికైనా కమీషన్ ​ఇవ్వాల్సిందే!

ఉత్తరాఖండ్​లో ఏ పనికైనా కమీషన్ ​ఇవ్వాల్సిందే!

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్​లో కమీషన్​ ఇవ్వకుంటే ఏ పనీ జరగదని బీజేపీ నాయకుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం తీరత్​ సింగ్​ రావత్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆ రాష్ట్రంలో ‘కమీషన్​ ఖోరి’ గురించి మాట్లాడిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. 

‘నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను. బహుశా ఇలాంటివి చెప్పకూడదేమో. కానీ, ఉత్తరాఖండ్​లో కమీషన్లు ఉన్నాయని నిస్సందేహంగా అంగీకరిస్తాను. మా రాష్ట్రం ఉత్తరప్రదేశ్​ నుంచి విడిపోయినప్పుడు ప్రజా పనులు జరగాలంటే 20 శాతం కమీషన్​ ఇవ్వాల్సి వచ్చేది. రాష్ట్రం విడిపోయిన తర్వాత అవి తగ్గాల్సి ఉండే. కానీ, ఆ ప్రాక్టీస్​ ఇంకా కొనసాగడమే కాకుండా కమీషన్లు 20 శాతం నుంచి మొదలయ్యాయి. దీనికి ఎవరినీ బాధ్యులను చేయలేము. మన రాష్ట్రాన్ని మనం సొంత కుటుంబంలా చూసినప్పుడే ఇది ఆగిపోతుంది..’ అని వీడియోలో ఆయన వ్యాఖ్యానించారు.

సొంత పార్టీ ప్రభుత్వంపై రావత్​ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది. కిందటేడాది మార్చిలో ఆయన సీఎంగా ఉన్న సమయంలో యువతులు ధరించే చిరిగిన జీన్స్​పై ట్విట్టర్​లో కామెంట్​చేసి వివాదంలో చిక్కుకున్నారు.