సూర్యకుమార్ యాదవ్‌ విలక్షణమైన బ్యాట్స్మన్

 సూర్యకుమార్ యాదవ్‌ విలక్షణమైన బ్యాట్స్మన్

టీమిండియా 360 డిగ్రీస్ బ్యాట్స్మన్  సూర్యకుమార్ యాదవ్‌పై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్యకుమార్ యాదవ్‌ విలక్షణమైన బ్యాట్స్మన్ అని కొనియాడాడు. మూడో స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బదులు సూర్యకుమార్ యాదవ్‌ను ఆడిస్తే బాగుంటుందని సూచించాడు. హంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. 

అతను ఏ స్థానంలో అయినా ఆడే ఆటగాడు..
ఆసియాకప్ 2022లో గౌతమ్ గంభీర్ హిందీ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు.  అయితే హాంకాంగ్  మ్యాచ్ అనంతరం టీవీ యాంకర్ జతిన్ సప్రుతో గంభీర్  మాట్లాడాడు. సూర్యకు మూడో ప్లేసే కరెక్ట్ అని..ఇది నా అభిప్రాయమంటూ గంభీర్ మాట్లాడుతుండగా..అతనికే చెప్పు అని జతిన్ సమాధానమిచ్చాడు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన సూర్య..గంభీర్ను వెనకాల నుంచి పట్టుకున్నాడు. దీంతో సూర్యను చూసిన గంభీర్ షాకయ్యాడు. సూర్య పట్టుకోవడంతో బలంగా నవ్వాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

హైఓల్టేజ్ మ్యాచ్..
ఆసియాకప్ 2022లో భాగంగా టీమిండియా లీగ్ దశలో రెండింటింలో గెలిచింది. గ్రూప్--A టాపర్‌గా నిలిచింది.  సూపర్ 4 లో భాగంగా భారత్‌ పాక్తో తలపడనుంది. ‌ఫస్ట్ మ్యాచ్ తరహాలోనే పాక్‌ను మళ్లీ ఓడించి తమ జోరు కొనసాగించాలని  టీమిండియా చూస్తుంటే..గత పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది.