రిటైర్డ్ జడ్జి ద్వారా నీరవ్ మెడీ, మోహుల్ చోక్సి ని కాంగ్రెస్ కాపాడుతోంది

రిటైర్డ్ జడ్జి ద్వారా నీరవ్ మెడీ, మోహుల్ చోక్సి ని కాంగ్రెస్ కాపాడుతోంది
  • కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపణలు

న్యూఢిల్లీ : బ్యాంక్ లకు అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన నీరవ్ మోడీ, మోహిల్ చోక్సి ని కాంగ్రెస్ పార్టీ కాపాడే ప్రయత్నం చేస్తోందంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ఇటీవల బ్యాంకులు రుణాల వేవ్ ఆఫ్ చేసిన వ్యవహారంలో ఆ అప్పులన్నీ మోడీ సన్నిహితులే తీసుకొని బ్యాంకులకు తిరిగి చెల్లించటం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ రవి శంకర్ ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. నీరవ్ మోడీని విదేశాల నుంచి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఓ రిటైర్డ్ జడ్జ్ అభయ్ తిప్సే అడ్డుపడుతున్నాడని చెప్పారు. జడ్జ్ గా పదవీ విరమణ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న తిప్సే ప్రస్తుతం నీరవ్ మోడీ కేసులో డిఫెన్స్ విట్ నెస్ గా ఉన్నాడన్నారు. నీరవ్ మోడీ పై ఏ కేసు లేదంటూ లండన్ కోర్టులో నీరవ్ మోడీని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. తిప్పే అనే వ్యక్తి కాంగ్రెస్ సభ్యుడే కాదు రాహుల్ గాంధీకి సన్నిహితుడని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. తిప్సేతో రాహుల్ గాంధీ దిగిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. కాంగ్రెస్ ఆదేశాల మేరకే ఆయన నీరవ్ ను తీసుకొచ్చే ప్రక్రియకు అడ్డుపడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ద్వారా నీరవ్ మోడీని, మొహిల్ చోక్సిని కాంగ్రెస్ పార్టీ కాపాడేందుకు ప్రయత్నిస్తుందన్న విషయం స్పష్టంగా తెలుస్తుందన్నారు. పంజాజాబ్ నేషనల్ బ్యాంక్ కు 13 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన నీరవ్ మోడీ, మోహిల్ చోక్సి ని యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాపాడారని చెప్పారు. చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో నీరవ్, మోహిల్ చోక్సి ఆర్థిక అవకతవకలకు పాల్పడినప్పటికీ చూసి చూడనట్లు గా ఉన్నారని విమర్శించారు. ఐతే నీరవ్ ను అరెస్ట్ చేసి ఇండియాకు తీసుకొచ్చేందుకు సీబీఐ గట్టి ప్రయత్నాలు చేస్తుందని త్వరలోనే వారిని పట్టుకొస్తామని చెప్పారు.