బీజేపీలోకి ఐఏఎఫ్ మాజీ చీఫ్​

బీజేపీలోకి ఐఏఎఫ్ మాజీ చీఫ్​
  •  ఆర్ కేఎస్ భదౌరియా
  • కేంద్ర మంత్రి ఠాకూర్ సమక్షంలో చేరిక

న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) మాజీ చీఫ్ ఆర్ కేఎస్. భదౌరియా బీజేపీలో చేరారు. ఆదివారం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, పార్టీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా భదౌరియా మాట్లాడారు. దేశ నిర్మాణంలో పాలుపంచుకోవడానికే కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించానని చెప్పారు. తన సర్వీస్ కాలంలో చివరి ఎనిమిది నుంచి పదేండ్లు స్వర్ణయుగంగా అభివర్ణించారు. 

మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. సాయుధ బలగాల ఆధునికీకరణకు, బలోపేతం చేయడానికీ మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. యూపీకి చెందిన భదౌరియా.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఐఏఎఫ్​లో దాదాపు 40 ఏండ్లు పనిచేసిన భదౌరియా 2021లో పదవీ విరమణ చేశారు.