
BSPలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు రిటైర్డ్ IAS ఆకునూరి మురళి. మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదన్నారు. తాను బహుజన సమాద్ వాదీ పార్టీ (BSP)లో చేరడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మీడియా ప్రజలకు తెలియజేయాలని కోరుతూ లేఖ విడుదల చేశారు ఆకునూరి మురళి. రిటైర్డ్ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్సీలో చేరటం దాదాపు ఖాయం అయిపోయిన నేపథ్యంలో… ఆయనతో చనువుగా ఉండే మరో రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి కూడా బీఎస్పీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఈ మధ్య ఈ ఇద్దరు అధికారులు కలిసే ప్రయాణం చేస్తున్న క్రమంలో పొలిటికల్ ఎంట్రీపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై స్పందించి ఈ ప్రచారానికి ఫుల్ స్టాఫ్ పెట్టారు మురళి.