అగ్ర కులాల నేతలకు ‘గారు’.. పీడిత వర్గాల వారికి ఏక వచనమా? 

V6 Velugu Posted on Jul 27, 2021

హైదరాబాద్: హుజూరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ మాజీ నేత కౌశిక్‌ రెడ్డి ఇటీవలే టీఆర్ఎస్‌లో చేరారు. తన సన్నిహితులు, మద్దతుదారులతో భారీగా టీఆర్ఎస్ భవన్‌కు చేరుకున్న కౌశిక్‌ను స్వయంగా సీఎం కేసీఆరే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  కౌశిక్ మద్దతుదారులను కూడా కేసీఆర్ గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్‌లోకి స్వాగతించారు. అయితే ఈ కార్యక్రమంలో కౌశిక్ రెడ్డి తీరుపై మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఆధిపత్య కులాల నాయకులను ‘గారు’ అని సంబోధించి, పీడిత వర్గాల నేతలను ఏకవచనంతో  పిలవడంపై ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కార్యక్రమంలో కౌశిక్ మాట్లాడిన వీడియోను ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. 

‘కౌశిక్ బ్రదర్, మీరు  ఆధిపత్య కులాల నాయకులను ‘గారు’ అని గౌరవించి, పీడిత వర్గాలకు చెందిన వారిని మాత్రం ఏక వచనంతో పిలిచారు. ఇది అభ్యంతరకరం. ఇలాంటి దురహంకార భావజాలం వల్లే జనాలు బహుజన రాజ్యం రావాలంటున్నరు. ప్రత్యేకంగా ఏ పార్టీకి కూడా నేను వ్యతిరేకం కాదు. కానీ దీన్ని తప్పక ఆపితీరాల్సిందే’ అని ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. 

 

Tagged TRS, leaders, Kaushik Reddy, RS praveen kumar, Former IPS Officer RS Praveen Kumar, Upper Casts, Lower Casts

Latest Videos

Subscribe Now

More News