ఎంఎస్ ధోని , యువరాజ్ సింగ్ లకు అరుదైన గౌరవం

ఎంఎస్ ధోని , యువరాజ్ సింగ్ లకు అరుదైన గౌరవం

భారత మాజీ క్రికెటర్లు ఎంఎస్ ధోని , యువరాజ్ సింగ్, సురేష్ రైనాలకు అరుదైన గౌరవం దక్కింది. మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్ (MCC)  జీవితకాల సభ్యత్వాన్ని కల్పించింది. వీరితో పాటు..భారత్ నుంచి  మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామిలకు కూడా MCC సభ్యత్వాన్ని అందించింది. క్రికెట్ కు అందించిన సేవలకు గానూ ఎంసీసీ భారత క్రికెటర్లతో పాటు..మరికొన్ని దేశాల క్రికెటర్లకు మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్ జీవితకాల సభ్యత్వాన్ని కల్పించింది. 

కొన్నేళ్ల క్రితం క్రికెట్ దిగ్గజం సచిన్ కు ఎంసీసీ లైఫ్ టైమ్ మెంబర్ షిప్ ఇచ్చి  సన్మానించింది. ఇంగ్లాండ్ కు చెందిన జెన్నీ గన్, లారా మార్ష్, ఇయాన్ మోర్గాన్, పీటర్సన్, అన్నా  శ్రుబ్ సోల్, పాక్  కు చెందిన మహ్మద్ హఫీజ్, ఆసీస్ కు చెందిన రేచల్ హేల్స్, బంగ్లాదేశ్ కు క్రికెటర్ మోర్తజా, న్యూజిలాండ్ ప్లేయర్ రాస్ టేలర్, సౌతాఫ్రికా ఆటగాడు డేల్ స్టెయిన్ లకు ఎంసీసీ జీవితకాల సభ్యత్వాన్ని  ఇచ్చి గౌరవించింది. 

ధోని నాయకత్వంలో టీమిండియా 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ లను సాధించింది. యువరాజ్ సింగ్ ఈ రెండు వరల్డ్ కప్  విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. సురేష్ రైనా 2011 వరల్డ్ కప్ సాధించిన జట్టులో సభ్యుడు. అంతేకాదు తన కెరీర్ లో రైనా మూడు ఫార్మాట్లలో కలిపి 7,988 పరుగులు సాధించాడు. అటు హైదరాబాద్ చెందిన మిథాలీ రాజ్ వన్డేల్లో అత్యధిక పరుగులు (7,805)  చేసిన మహిళా క్రికెటర్ గా రికార్డు కెక్కాడు. అత్యధిక మ్యాచుల్లో (155) కెప్టెన్ గా వ్యవహరించిన ప్లేయర్ గా చరిత్ర సృష్టి్ంచింది.