మామీద కక్షతో రైతులకు నష్టం చేయొద్దు :మాజీ మంత్రి హరీష్రావు

మామీద కక్షతో రైతులకు నష్టం చేయొద్దు :మాజీ మంత్రి హరీష్రావు

ప్రాజెక్టులను వెంటనే పునరుద్దరించి రైతులకు నీళ్లివ్వాలని..మాపై కక్షతో రైతులకు నష్టం చేయొద్దని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. యాసంగి పంటలకు నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు చెప్పారు. వందరోజుల పాలన చూసి మాకు ఓట్లేయమని సీఎం రేవంత్ రెడ్డి అడుగుతున్నారు.. వందల రోజుల పాలనలో ఏం ఉంది.. వైట పేపర్, బ్లాక్ పేటర్లు తప్పా.. చివరికి ప్రధాని మోదీకి ఓ కాషాయం లెటర్ తప్పా ఏమీ లేదని విమర్శించారు. 

గుజరాత్ ఫెల్యూర్ మోడల్ అని రాహుల్ గాంధీ అంటుంటూ.. గుజరాత్ మోడల్ తెలంగాణకు కావాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. మళ్లీ మోదీ ప్రధాని కావాలని పరోక్షంగా కోరుకుంటున్నారని ఆరోపించారు. రాహుల్ ప్రధాని కావాలని అనుకుంటే మోదీ సహాయ సహకారాలెందుకు అన్ని ప్రశ్నించారు. రాహుల్ ప్రధాని కాడు అని రేవంత్రెడ్డి చెప్పకనే చెబుతున్నారని హరీష్ రావు విమర్శించారు. 

మూడు నెలల పాలనతో ప్రజలను , సొంత కాంగ్రెస్ పార్టీని మోశారు సీఎం రేవంత్ రెడ్డి అని హరీష్ రావు విమర్శించారు. రుణమాఫీ అన్నారు..బడ్జెట్ లో దానిపై ప్రకటన కూడా లేదు..రైతుబంధు, ధాన్యం బోనస్ తో కొంటామన్నారు.. 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు.. ఏ ఒక్కటి జరగలేదన్నారు. ఎన్నికల టైం వరకు యాసంగి పంట వస్తది.. ఇప్పటివరకు పంటలకు నీళ్వివ్వలేదన్నారు. కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది. ట్రాన్స్ ఫార్మర్లు కాలుతున్నాయి.. కష్టాలు మొదలయ్యాయని రైతుల్లో చర్చ జరుగుతుందన్నారు. కౌలు, వ్యవసాయ కూలీలు నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి కొట్టిందని రైతులు ఆలోచించి ఓట్లేయాలన్నారు హరీష్రావు. 

ఆసరా పింఛన్లు పెంచుతామని మాటిచ్చి పెన్షన్లు ఇస్తలేరని హరీష్ రావు అన్నారు. 6 గ్యారంటీలు అమలు చేస్తేనే కాంగ్రెస్ కు లోక్ సభ ఎన్నికల్లో ఓట్లడిగే నైతికత ఉంటుందన్నారు. LRS వద్దన్నారు. ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారు.. ప్రజాదర్బార్ పై డబ్బా కొట్టి.. ఇప్పుడు విలేకరులను బ్యాన్ చేశారన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తాం అని మాట ఇచ్చి తప్పినందుకు నిరుద్యోగులు ఆలోచించి ఓటేయ్యాలన్నారు. మరోవైపు గృహలక్ష్మీ పథకానికి నిబంధనలు పెట్టి తూట్లు పోడిచారని విమర్శించారు.  కల్యాణ లక్ష్మీలో తులం బంగారం ఇస్తామని మోసం చేశారని..మహిళలు ఆలోచించి ఓటేయాలన్నారు హరీష్ రావు. 

మా ఎంపీలను బీజేపీ గుంజుకుంటుంటే మాకు బీజేపీతో పొత్తు అనడం విడ్డూరంగా ఉందన్నారు హరీష్ రావు. కర్ణాటక బీజేపీ, రాష్ట్ర బీజేపీ నేతలు రేవంత్ ను మెచ్చుకుంటున్నార ఎందుకో చెప్పాలన్నారు.మేం నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలను రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో చెప్పాలన్నారు హరీష్ రావు. రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి మాట నిలుపుకోవాలన్నారు.