మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్(66) గురువారం రాత్రి మృతిచెందారు. కరోనాతో బాధపడుతున్న ఆయన మూడురోజుల కిందట హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.వరంగల్జిల్లా జగ్గన్నపేటకు చెందిన అజ్మీరా చందూలాల్ ఎన్టీఆర్, కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంత్రిగా పనిచేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా ఉన్నారు. 2014 లో ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గం నుంచి గెలుపొంది సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా సేవలందించారు.
