
- మాజీ మంత్రి హరీశ్రావు
సిద్దిపేట, వెలుగు: -తెలంగాణ ఉద్యమ ప్రారంభంతో బతుకమ్మ పండుగకు ప్రపంచ ఖ్యాతి లభించిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సోమవారం సిద్దిపేట కోమటి చెరువు వద్ద హరీశ్రావు దంపతులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మాట్లాడారు. - తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగను రాష్ట్ర అధికారిక పండుగగా నిర్వహించారని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మన పండుగలకు ఆదరణ లభించలేదని కానీ ఇప్పుడు అమెరికా, లండన్, దుబాయ్ వంటి దేశాల్లో బతుకమ్మ ఆడుతున్నారన్నారు.
ప్రపంచంలో పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణలోనే ఉందన్నారు. అనంతరం కొండపాక మండలం మర్పడ్గ గ్రామంలోని విజయ దుర్గా సమేత శ్రీ సంతాన మల్లి ఖార్జున దేవాలయం, సిద్దిపేట రూరల్ మండలం సీతారాం పల్లిలో ఏర్పాటు చేసిన అమ్మవారిని హరీశ్ రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.