పాకిస్తాన్ లో బాంబు పేలుడు.. తునాతునకలైన వాహనాలు.. సీసీఫుటేజ్లో రికార్డ్

పాకిస్తాన్ లో బాంబు పేలుడు.. తునాతునకలైన వాహనాలు.. సీసీఫుటేజ్లో రికార్డ్

పాకిస్తాన్​ లోని బలూచిస్తాన్​ ప్రావిన్స్​భారీ పేలుడు సంభవించింది. మంగళవారం (సెప్టెంబర్​30) మధ్యాహ్నం క్వెట్టా ప్రాంతంలో జరిగిన పేలుడులో స్పాట్ లో 10 మంది చనిపోయారు. వాహనాలు తునాతునకలై పోయాయి. పలువురు గాయపడ్డారు. 

క్వెట్టాలోని జర్ఘున్ రోడ్‌లోని FC (ఫ్రాంటియర్ కార్ప్స్) ఆఫీసు సమీపంలో బాంబు పేలింది. పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ళు కూలిపోయాయి. భవనాల కిటికీలు పగిలిపోయాయి. 

పేలుడు తర్వాత కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో స్థానికులు భయంతోపరుగులు పెట్టారుని, పేలుడుఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వర్గాలు తెలిపారు. రద్దీగా ఉండే రోడ్డుపై పేలుడు సంభవించిన దృశ్యాలు CCTV వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది.